- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : డయాబెటిస్, ఒబెసిటీ మందుల ధరలు తగ్గనున్నాయి. టైప్-2 డయాబెటిస్ రోగులలో షుగర్ నియంత్రణకు ఒజెంపిక్, ఒబెసిటీ చికిత్సలో వెగోవి విస్తృతంగా వాడుతున్నారు. ఈ డయాబెటిస్‌కి వాడే సెమాగ్లుటైడ్ (ఒజెంపిక్, వెగోవి) మందుల పేటెంట్ నేటితో (శుక్రవారం) ముగుస్తుంది. దీని ఫలితంగా ఈ మందులను పేటెంట్‌తో పని లేకుండా ప్రభుత్వ అనుమతితో తయారు చేసి, విక్రయించటం సులభమవుతుంది. దీనివల్ల ధరలు 50–70% వరకు తగ్గే అవకాశం ఉంది. అంటే ప్రతి రోగి సంవత్సరానికి సుమారు ₹60,000–70,000 వరకు ఆదా చేయగలుగుతారు.
- Advertisement -



