Friday, March 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ బడ్జెట్‌..కాసేపట్లో క్యాబినెట్ భేటీ

తెలంగాణ బడ్జెట్‌..కాసేపట్లో క్యాబినెట్ భేటీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఉదయం 9.30కి రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయనుంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగిస్తారు. శాసనమండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ పద్దులను సభ ముందు ఉంచుతారు. ఈ బడ్జెట్ సుమారు రూ.3.15 లక్షల కోట్ల నుంచి రూ.3.22 లక్షల కోట్ల అంచనాతో రూపొందించబడినట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -