– రెండు నెలలుగా మృత్యువు తో పోరాడి నేడు తుది శ్వాస
– రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసింది
నవతెలంగాణ-కుభీర్ : మండలంలోని కుప్టి గ్రామా సర్పంచ్ పొనుగంటి గంగారాం శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందారు.బైంసా పట్టణంలోని బస్సు డిపో సమీపంలో బ్రిడ్జిపై జనవరి 20 న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గంగారం ను నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. సర్పంచ్ పొనుగంటి గంగారం ఆరోగ్యం మెరుగుపడడంతో గత వారం రోజుల కిందట స్వగ్రామమైన కుట్టి గ్రామానికి తీసుకువచ్చారు. శుక్రవారం ఉదయం ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే భైంసా లోని ప్రైవేట్ ఆస్పత్రిలోకి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ గా ఎన్నికయ్యారు. ఆయన మృతి చెందిన వార్త తెలియడంతో గ్రామస్తులు, మండల సర్పంచులు అధికారులు పలువురు సంతాపం వ్యక్తం చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు స్వగ్రామం కుట్టిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
చికిత్స పొందుతూ కుప్టి సర్పంచ్ పొడుగంటి గంగారం మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



