నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో జర్నలిస్టులకు సంబంధించి ఎలాంటి ప్రస్తావనే లేదని తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్(TWJF) వాపోయింది. ఈమేరకు శుక్రవారం TWJF యాక్టింగ్ ప్రెసిడెంట్ పి. రాంచందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. సమాచార శాఖను ప్రభుత్వం మరిచిపోయింది. మీడియా అకాడమీ గురించి బడ్జెట్లో ఏమి చెప్పలేదు. బడ్జెట్లో నిధులను కేటాయించకుండా సంక్షేమ కార్యక్రమాలను ఎలా అమలు చేస్తారు?, ఇండ్ల స్థలాల గురించి కూడా ఏమీ చెప్పలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత జర్నలిస్టులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. కనీసం అక్రిడిటేషన్ కూడా ఇవ్వలేదు. రెండు యేండ్లుగా గడువును పొడిగించుకుంటూ పోతున్నారని విమర్శించింది. ఇది అన్యాయం కాదా? ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరినా సర్కార్ స్పందించలేదని వాపోయింది.
వేలాది మంది జర్నలిస్టులు బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఉత్తమ జర్నలిస్టు అవార్డుల ప్రస్తావన లేకపోవడం ఆందోళనకరమన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమాజం దృష్టికి తీసుకుపోతున్న మీడియా పట్ల పూర్తి నిర్లక్ష్యం కనిపిస్తున్నది. అక్రిడిషన్స్, ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు మహిళా జర్నలిస్టుల సమస్యలపై బడ్జెట్ లో రేఖామాత్రంగా కూడా ప్రస్థావించికపోవడం అన్యాయం. ఫ్యూచర్ సిటీలో ఇండ్ల స్థలాలు Tomorrow’s ముఖ్యమంత్రి హమీ ని సైతం బడ్జెట్ లో చెప్పకపోవడం జర్నలిస్టులను ఆవేదన, ఆందోళన కు గురిచేస్తున్నదని, ఈ అంశాలపై ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.



