Wednesday, April 30, 2025
Homeసినిమానవ్విస్తుంది..ఏడిపిస్తుంది

నవ్విస్తుంది..ఏడిపిస్తుంది

కథానాయకుడు సంపూర్ణేష్‌ బాబు అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో రూపొందిన ‘సోదరా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో ఆయనతోపాటు సంజోష్‌ కూడా మరో హీరోగా నటిస్తున్నారు. మన్‌మోహన్‌ మేనం పల్లి దర్శకుడు. క్యాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై చంద్ర చగంలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్బంగా చిత్ర కథానాయకులు సంపూర్ణేష్‌ బాబు, సంజోష్‌లు మీడియాతో ముచ్చటించారు. సంపూర్ణేష్‌ బాబు మాట్లాడుతూ, ‘అన్నదమ్ముల బంధం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. అలాంటి అన్నదమ్ముల బంధాన్ని వెండితెరపై మనకు ఆవిష్కరించబోతున్న చిత్రమే ఇది. ఇది నా గత చిత్రాల తరహాలో ఉండదు. ఇదొక కుటుంబ కథ. ఇద్దరు అన్నదమ్ముల కథ. అన్నగా బరువు బాధ్యతలు ఉన్న పాత్రను ఈ చిత్రంలో పోషించాను. ఈ సినిమా చూస్తున్నంత సేపు అందరికి తమ రియల్‌లైఫ్‌ సంఘటనలు గుర్తుకు వస్తాయి. నా రియల్‌లైఫ్‌లో ఉండే నరసింహాచారికి ఈ చిత్రంలో చేసిన పాత్రకు దగ్గరి పోలికలు ఉంటాయి. అలాగే నా సినిమాలో ఉండే వినోదంతో పాటు కుటుంబ భావోద్వేగాలు కూడా ఉంటాయి. సినిమా చూసిన తరువాత ప్రతి ఒక్కరూ తమ అన్నాదమ్ములకు ఫోన్‌ చేస్తారు. ఇందులో ఉండే వినోదం కూడా ఎంతో ఆహ్లాదంగా, ఫ్యామిలీ మొత్తం నవ్వుకునేలా ఉంటుంది’ అని తెలిపారు. ‘నేను ఇంతకు ముందు ‘బేవార్స్‌’ సినిమాలో హీరోగా నటిం చాను. సంపూతో కలిసి ఓ బ్రదర్‌గా ఈ సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది అమాయకుడైన అన్న, అప్‌డేట్‌ అయినా తమ్ముడి కథ. ఇలాంటి అన్నదమ్ముల కథతో ఇప్పటి వరకు తెలుగులో ఏ సినిమా రాలేదు.ఈ సినిమా చూసిన తరువాత అందరూ కనెక్ట్‌ అవుతారు. సినిమా పూర్తవగానే అన్నకు తమ్ముడు, తమ్ముడు అన్నకు తప్పనిసరిగా ఫోన్‌ చేసి మాట్లాడుతాడు. అంతలా అందరి హదయాలకు హత్తుకునే సినిమా ఇది. ఎమోషనల్‌ అన్నదమ్ములు కలిసి ఉండాలి అనికోరుకునే కథ ఇది’ అని మరో కథానాయకుడు సంజోష్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img