నవతెలంగాణ-హైదరాబాద్: వేతనాల్ని పెంచాలని, మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని వందలాది వైద్యులు స్పెయిన్‌లో సమ్మె చేపట్టారు. ఈ నెల్లో ఒకవారంలోనే వైద్యులు సమ్మె చేయడం ఇది రెండోసారి. వైద్యుల సమ్మెతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. తాజాగా వైద్య నిపుణులు, వైద్యులు స్పెయిన్‌లో మాడ్రిడ్‌లోని ఆరోగ్య మంత్రిత్వశాఖ, ప్రాంతీయ మండలి వెలుపల సమ్మె చేపట్టారు. ఇటీవల మెజార్టీ మెడికల్ యూనియన్లతో చర్చలు జరిపినా వైద్యులపై పనిభారం తగ్గలేదు. దీంతో వారంలో మరోసారి వైద్యులు సమ్మెబాట పట్టారు. ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులకు వారానికి 48 గంటలకు మించి పని గంటలు పెరిగాయి. సిబ్బంది కొరత వల్ల పనిభారం ఎక్కువై అధిక ఒత్తిడికి గురవతున్నారు. వారి ఆరోగ్యం క్షీణిస్తోంది. అంతేకాకుండా ఫ్రాన్స్, జర్మనీ వంటి ఇతర ఐరోపా దేశాలలోని వైద్యులకు స్పెయిన్‌లోని వైద్యుల జీతాల మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉంది. అందుకే ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణ నిపుణులందరికీ వర్తిస్తున్న చట్టం నుండి వైద్యులను మినహాయించాలి. దానికోసం ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని మెడికల్ యూనియన్స్ డిమాండ్ చేస్తున్నాయి. ఈ ప్రత్యేక చట్టం ద్వారా వైద్యుల బాధ్యతలు, పనిభారానికి తగిన గుర్తింపు లభిస్తుందని మెడికల్ యూనియన్స్ చెబుతున్నాయి.
స్పెయిన్‌లో వైద్యులు సమ్మె
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



