Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుశ్రీలీలకు రహస్యంగా నిశ్చితార్థం..?

శ్రీలీలకు రహస్యంగా నిశ్చితార్థం..?

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: యంగ్ హీరోయిన్ శ్రీలీల తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఫొటోల్లో శ్రీలీల పెళ్లికూతురి గెటప్‌లో కనిపించడంతో పాటు, కొందరు ఆమె చెంపలకు పసుపు రాస్తున్న దృశ్యాలు ఉన్నాయి. దీనికితోడు “నాకు ఈ రోజు చాలా పెద్దది (బిగ్ డే). పూర్తి వివరాలు త్వరలోనే చెబుతాను, కమింగ్ సూన్” అంటూ ఆమె రాసుకొచ్చిన క్యాప్షన్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. శ్రీలీలకు రహస్యంగా నిశ్చితార్థం జరిగిపోయిందా? లేక పెళ్లి చేసుకోబోతోందా? అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అయితే, మరికొందరు మాత్రం ఇవి నిజమైన వేడుక ఫొటోలు కావని, ఏదైనా కొత్త సినిమా ప్రమోషన్ లేదా వాణిజ్య ప్రకటనకు సంబంధించినవి అయిఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img