నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా చేపట్టిన క్షిపణి దాడుల్లో ఐఆర్‌జీసీ అధికార ప్రతినిధి జనరల్ అలీ మహమ్మద్ నయీని మృతిచెందారు. ఈ విషయాన్ని ఐఆర్‌జీసీ(ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) శుక్రవారం ధ్రువీకరించింది. దీంతో ఇరాన్ సైన్యంలో మృతిచెందిన ప్రముఖుల సంఖ్య నాలుగుకు చేరింది. అంతకముందు.. ఇవే దాడుల్లో అలీ లారిజాని(ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ సన్నిహితుడు), జి.సోలేమాని, నిఘా విభాగానికి చెందిన ఇస్మాయిల్ ఖతీబ్ వంటి ముగ్గురు సీనియర్ అధికారులు మరణించారు.
కాగా.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఫిబ్రవరి 28న అయతుల్లా అలీ ఖమేనీ మృతిచెందారు. ఆ తర్వాత ఇరాన్ నాయకత్వంలోని పలువురు ప్రముఖులు మరణించారు. ఇటీవల ఇరాన్ గూఢచార మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించాయి. అంతలోనే నయీని మృతిచెందారు.



