– సుప్రీంకోర్టు తీర్పుపై మంత్రి తుమ్మల హర్షం
నవతెలంగాణ-సత్తుపల్లి
తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పట్ల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక తీర్పుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మైలురాయి లాంటి ‘సీతమ్మ సాగర్’ బహుళార్ధసాధక ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమైందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా 36.37 టీఎంసీల నీటిని నిల్వ చేసి, దాదాపు 6.74 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు అందించవచ్చని స్పష్టం చేశారు. నీటిపారుదలతో పాటు 282.80 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడే పర్యావరణ అనుమతుల సాధన కోసం నిరంతరం కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, అధికారులకు మంత్రి తుమ్మల ధన్యవాదాలు తెలిపారు.
‘సీతమ్మసాగర్’ ప్రాజెక్టుకు బిగ్ రిలీఫ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



