Saturday, March 21, 2026
E-PAPER
Homeజాతీయంమంటల్లో కాలిపోయిన ట్రావెల్స్ బస్సు..

మంటల్లో కాలిపోయిన ట్రావెల్స్ బస్సు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భువనేశ్వర్ నుంచి మల్కాజిగిరికి వెళ్తుండగా ఒడిశాకు చెందిన ట్రావెల్స్ బస్సుకు అగ్ని ప్రమాదం జరిగింది. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం తారాపురం వద్ద అగ్నికి ఆహుతైంది. వెనుక టైర్ పేలడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి నిద్రలో ఉన్న ప్రయాణికులను వెంటనే లేపడంతో అందరూ కిందకు దిగిపోయారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటన సమయంలో బస్సులో ఒడిశాకు చెందిన ఓ ఎమ్మెల్యే సహా 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -