- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దక్షిణ కొరియాలోని డేజియోన్ నగరంలో శుక్రవారం మధ్యాహ్నం కారు విడిభాగాల కర్మాగారంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. భారీ పేలుడుతో ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 10 మంది మృతి చెందగా, 59 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 14 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 500 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
- Advertisement -



