Saturday, March 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సాహిత్యం సామాజిక చైతన్యానికి ఆయుధం కావాలి

సాహిత్యం సామాజిక చైతన్యానికి ఆయుధం కావాలి

- Advertisement -

నవతెలంగాణ కంఠేశ్వర్ 

సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నవారికి సేవా గుణాన్ని, సమస్యలతో సతమతమయ్యే పేదలకు పోరాట పటిమను అందించే శక్తి ఒక్క సాహిత్యానికే ఉందని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఘనపురం దేవేందర్ అన్నారు. మెదక్ పట్టణంలోని టీఎన్జీవోస్ భవన్‌లో తెలంగాణ రచయితల సంఘం మెదక్ జిల్లా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది ఉత్సవాలకు ఆయన గౌరవ అతిథిగా హాజరై ప్రసంగించారు. కవిత్వం అనేది కేవలం సందర్భానుసారంగా పుట్టేది కాదని, వర్తమాన కాల పరిస్థితులపై నిరంతరం స్పందిస్తూ సాగే ప్రవాహమని ఆయన అభివర్ణించారు. నీతి, నిజాయితీతో ప్రజల పక్షాన నిలబడి, ఉద్యమ రీతిలో స్పందించే కవులు, రచయితలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారని పేర్కొన్నారు.

కాళోజీ, దాశరథి, శ్రీశ్రీ, జాషువా వంటి మహనీయుల ఆశయాలను వారసత్వంగా స్వీకరించి రచయితలు ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దేవేందర్ తన స్వీయ కవిత పరాభవం చదివి వినిపించారు.  ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్‌పర్సన్ కె. రాధిక, తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షురాలు ఎం. కవిత, టీఎన్జీవోస్ సెంట్రల్ కమిటీ సభ్యురాలు అనురాధతో పాటు ప్రముఖ కవులు అంజా గౌడ్, సాయి సిరి, సుధాకర్, బుర్ర సంతోష్, నవీన్, వడ్ల వెంకటేష్, అంజలి, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -