నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా పరిధిలోని కోడూరి గ్రామంలో ఉన్న పురాతన హనుమండ్ల గుడి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రతిష్టించనున్న నూతన హనుమాన్ విగ్రహానికి “షబ్బీర్ అలీ ఫౌండేషన్” ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ చేతుల మీదుగా కోయల్కార్ కన్నయ్య తమ సొంత నిధులతో రూ.60,000 (అరవై వేల రూపాయలు) విరాళంగా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా భక్తులు దేవుని కృప అందరి పై ఉండాలని ప్రార్థించారు. ఇంకా గుడి నిర్మాణం కొనసాగుతున్నందున, దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయం అందించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో పండ్ల రాజు, కారంగుల అశోక్ రెడ్డి, మోహన్ రెడ్డి, కోయల్కార్ కన్నయ్య, నిమ్మ దామోదర్ రెడ్డి, చింతల శ్రీనివాస్, గుడుగుల శ్రీనివాస్, సత్యం, ప్రతిభ రమేష్, పెంట నర్సింలు, పిల్లి మల్లేష్, నారెడ్డి నరేష్ రెడ్డి, బొజ్జ రవి, ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.



