- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రశ్నించేవారంతా నక్సలైట్లు కాదని, మోడీ ప్రభుత్వ విధానాలు దేశానికి మంచివి కావని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అన్నారు. ప్రజల కోసం కష్టపడేవారు కనిపించడం లేదని, రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. తమ పనులు చక్కబెట్టుకోవడానికి కొందరిపై ముద్ర వేసి అణిచివేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 24, 25 తేదీల్లో కామారెడ్డిలో రాష్ట్ర మహాసభలు జరుగుతాయని వెల్లడించారు.
- Advertisement -



