Sunday, March 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డాక్టర్ ముజీబ్ కి రంజాన్ శుభాకాంక్షలు

డాక్టర్ ముజీబ్ కి రంజాన్ శుభాకాంక్షలు

- Advertisement -

నవతెలంగాణ-సిటీ బ్యూరో : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని టీఎన్జీఓఎస్ యూనియన్ సెంట్రల్ జనరల్ సెక్రటరీ డా. ఎస్. ఎం. హుస్సైనీ ముజీబ్ కి యూనియన్ నేతలు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువా, పుష్పగుచ్ఛం, హారంతో సత్కరించి, ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని టీఎన్జీఓఎస్ యూనియన్ హైదరాబాద్ అసోసియేట్ ప్రెసిడెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ తెలంగాణ సెంట్రల్ ఫోరం ప్రెసిడెంట్ శ్రీ కె.ఆర్. రాజ్‌కుమార్, హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ బొలిగిడ్డ శంకర్, పబ్లిక్ సెక్రటరీ శ్రీ వైదిక శాస్త్ర, ఈసీఎస్ శ్రీ శ్రీధర్, శ్రీ ముకీద్ ఖురేషీల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డా. ఎస్. ఎం. హుస్సైనీ ముజీబన్నా మాట్లాడుతూ, “రంజాన్ ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండుగ. ఇది ఉపవాసం, క్రమశిక్షణ, సహనం , సేవా భావాన్ని పెంపొందించే కాలం. పవిత్రమైన ఈ మాసంలో మనసును నిర్మలంగా ఉంచుకుని, తోటివారికి సహాయం చేయడం ద్వారా సమాజంలో సౌహార్దం మరియు ఐక్యతను చాటాలి” అని పిలుపునిచ్చారు. అలాగే, అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవం, ప్రేమతో కలిసి జీవించాలనే సందేశాన్ని ఈ పండుగ ఇస్తుందని, ఈద్ పర్వదినం అందరి జీవితాల్లో ఆనందం, శాంతి, సౌభ్రాతృత్వాన్ని నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోఎస్ యూనియన్ ఐటీఐ యూనిట్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, క్యాన్సర్ హాస్పిటల్ యూనిట్ ప్రెసిడెంట్ శివకుమార్, సెక్రటరీ శేఖర్, ట్రెజరర్ మహేష్ యాదవ్, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ కానిస్టేబుల్ ప్రెసిడెంట్ నయీమ్, ఓఎంసీ యూనిట్ ప్రెసిడెంట్ అనిల్, ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ సెంట్రల్ ఫోరం జాయింట్ సెక్రటరీ సుదర్శన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ శివ, శేఖర్, కల్చరల్ సెక్రటరీ శ్రీనివాస్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఈసీ సభ్యుడు ప్రియదేవ్ ఠాకూర్, ఈఎస్‌ఐ డిపార్ట్‌మెంట్ జాయింట్ సెక్రటరీ శ్రీ అఖీలాన్, శ్రీ ఉస్మాన్ భాయ్, శ్రీ రామకృష్ణన్న, శ్రీ మహమ్మద్ భాయ్ పాల్గొన్నారు. వీరితో పాటు శ్రీ ఫజీయుల్లా, శ్రీ జుబేర్, శ్రీ మురళీధర్, శ్రీ మధుకర్, శ్రీ అధినారాయణ, శ్రీ అనిల్ కుమార్, శ్రీ కృష్ణ, శ్రీ రాజు, శ్రీ దామోదర్, శ్రీ కైరాజ్, శ్రీ రమేష్, శ్రీ రవి, శ్రీ బాలాజీ గోస్వామి, శ్రీ సురేష్, శ్రీ సమీర్, శ్రీ అన్వర్, శ్రీ ఫరూక్ తదితరులు పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -