నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై మరోసారి చర్చ ప్రారంభమైంది. ఎయిర్‌ఫోర్స్ వన్ నుంచి దిగేటప్పుడు ఆయన కాస్త తడబడుతూ అడుగులు వేయడమే అందుకు కారణం.
శనివారం ఎయిర్‌ఫోర్స్‌వన్‌లో ట్రంప్ ఫ్లోరిడాకు చేరుకున్నారు. ఈ క్రమంలో రెయిలింగ్ పట్టుకుని విమానం దిగుతూ కన్పించారు. మధ్యలో ఆగుతూ, తడబడుతూ, జాగ్రత్తగా నడుస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా.. దీనికి ముందు రోజు ఓ కార్యక్రమానికి సంబంధించిన వీడియో కూడా తాజాగా వైరల్ అవుతుంది. అందులో ట్రంప్ కుర్చీలో కూర్చునేందుకు ఇబ్బంది పడినట్లుగా కన్పిస్తోంది. దీంతో అధ్యక్షుడి ఆరోగ్యంపై మరోసారి వార్తలు వస్తున్నాయి. ఈ వీడియోలపై కొందరు నెగెటివ్ కామెంట్లు పెడుతుండగా.. మరికొందరు ఇది సాధారణమైన విషయమేనని కొట్టిపారేస్తున్నారు. ఇక, ట్రంప్ ఆరోగ్యంపై గతంలో కూడా చర్చ జరిగింది. వైట్‌హౌస్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. ట్రంప్ కూడా తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని అనేకసార్లు పేర్కొన్నారు.



