- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. నిన్న రాత్రి 8:57 సమయంలో ఇది నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం.. సముద్రంలోని 10 కిలోమీటర్ల లోతులో చోటుచేసుకుంది. ఈ భూకంపం తక్కువ లోతులో సంభవించడం వల్ల అదే ప్రాంతంలో చిన్నచిన్న భూకంపాలు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. ఇవి సాధారణంగా ప్రధాన భూకంపం కంటే తక్కువ తీవ్రత కలిగి ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో నష్టాన్ని కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- Advertisement -



