- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం నాగేందర్ పార్టీ మారలేదన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యాఖ్యలను సవాలు చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. అనంతరం, నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యే దానంకు, స్పీకరుకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.
- Advertisement -



