Monday, March 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబియ్యం రవాణాలో భారీ కుంభకోణం: హరీశ్‌రావు

బియ్యం రవాణాలో భారీ కుంభకోణం: హరీశ్‌రావు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ పౌరసరఫరాల శాఖలో బియ్యం ఎగుమతుల చుట్టూ భారీ కుంభకోణం జరిగిందంటూ అసెంబ్లీలో మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని ప్రభుత్వానికి అడ్వైజర్‌గా ఎలా నియమించుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై తక్షణమే ‘హౌజ్ కమిటీ’ వేయాలని డిమాండ్ చేశారు. వేల కోట్ల బ్యాంక్ ఫ్రాడ్, బంగారం స్మగ్లింగ్ వంటి సీబీఐ, ఈడీ కేసుల్లో నిందితుడిగా ఉన్న ప్రేమ్ చంద్ గార్గ్ అనే వ్యక్తిని బియ్యం ఎగుమతులకు అడ్వైజర్‌గా ఎందుకు నియమించుకున్నారని హరీశ్ రావు నిలదీశారు. ఆయన ఇచ్చిన తప్పుడు సలహాల వల్లే రాష్ట్ర ఖజానాకు భారీ గండి పడిందని ఆరోపించారు.

పది లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి చేస్తామని, ఇది ఒక అంతర్జాతీయ విజయం అని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం.. తీరా చూస్తే కేవలం 22,750 టన్నుల దగ్గరే ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించారు. ఏడాది కాలంగా సుమారు 7,500 టన్నుల బియ్యం కాకినాడ పోర్టులోనే నిలిచిపోయి పురుగులు పడుతున్నాయని, దీనికి బాధ్యులు ఎవరని ఆయన అడిగారు. వాటాల బేరసారాలు కుదరకపోవడం వల్లే ఎగుమతులు ఆగిపోయాయని హరీశ్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ పాలన పారదర్శకంగా ఉంటే, తాము తప్పు చేయలేదని భావిస్తే.. ఈ కుంభకోణాలపై విచారణకు హౌజ్ కమిటీ వేయాలని, దీనిని తాము ఆధారాలతో సహా నిరూపిస్తామని సవాల్ విసిరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -