- Advertisement -
నవతెలంగాణ-ఆర్మూర్: ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి సర్కార్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు చేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పాలెపు రాజు సోమవారం తెలిపారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి నాయకత్వంలో ఇందూరు జిల్లా కేంద్రంలో కలక్టరేట్‌ను ముట్టడించి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పాల్కం వేణు, ఓబిసి మోర్చా అధ్యక్షుడు మిర్యాల్కర్ కిరణ్, మాక్లూర్ నాయకులు మదారి రాజేశ్వర్, నందిపేట నాయకులు సూది సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



