Monday, March 23, 2026
E-PAPER
Homeజిల్లాలురైతు భరోసా ఇప్పించాలని రైతుల వినతి

రైతు భరోసా ఇప్పించాలని రైతుల వినతి

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్‌పల్లి: తమకు కూడా రైతు భరోసా ఇప్పించాలని కోరుతూ మండల కేంద్రానికి చెందిన పలువురు రైతులు సోమవారం మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీకి వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు స్థానిక రైతు వేదిక భవనంలో వ్యవసాయ అధికారిని కలిసిన రైతులు తమ గోడు వెళ్ళబోసుకొని వినతిపత్రం అందించారు.కమ్మర్ పల్లి గ్రామంలోని 386 సర్వే నెంబర్ లో సంవత్సరాలుగా పంటలు వేస్తున్న రైతులకు గత రెండు దఫాలుగా రైతు భరోసా రావడం లేదన్నారు. ఈ విషయమై పలుమార్లు మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో వినతి పత్రం అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు.

అంతేకాకుండా తమ సమస్యపై జిల్లా కేంద్రంలో ప్రజావాణిలో కూడా రెండుసార్లు కలెక్టర్ కు వినతి పత్రం అందజేసినట్లు బాధిత రైతులు గుర్తు చేశారు అయినా రైతు భరోసా రావడం లేదని, ఇకనైనా పెద్దల దృష్టికి తీసుకెళ్లి నిరుపేదలైనటువంటి రైతులకు రైతు భరోసా ఇప్పించాలని బాధిత రైతులు వినతి పత్రంలో కోరారు.కార్యక్రమంలో రైతులు బద్దం రాజశేఖర్, సల్లూరి రమేష్ గౌడ్, ఉట్నూర్ బాలయ్య, కల్లడ రమేష్, యాదగిరి, రాహుల్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -