Monday, March 23, 2026
E-PAPER
Homeజాతీయంలోక్‌సభలో కార్పొరేట్‌ చట్టాల బిల్లు

లోక్‌సభలో కార్పొరేట్‌ చట్టాల బిల్లు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: సోమవారం లోక్‌సభలో కార్పొరేట్‌ చట్టాల (సవరణ) 2026 బిల్లును కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు. సమగ్ర పరిశీలన కోసం ఈ బిల్లును జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)కి పంపాలన్న తీర్మానాన్ని లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లు పరిమిత బాధ్యత భాగస్వామ్య చట్టం 2008, కంపెనీల చట్టం 2013లకు మరిన్ని సవరణలను కోరుతోంది. ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ప్రతిపాదనలను వివరించే ఫైనాన్స్‌ బిల్లు 2026ను కూడా పరిశీలన కోసం ఆర్థికమంత్రి ప్రవేశపెట్టనున్నారు.

కాగా, నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన కార్పొరేట్‌ చట్టాల (సవరణ) బిల్లును ప్రవేశపెట్టడానిన కాంగ్రెస్‌ ఎంపి మనీష్‌ తివారీ వ్యతిరేకించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 245-246ను ఉల్లంచి ఈ బిల్లులో ముఖ్యమైన శాసన విధులను మితిమీరి అప్పగించారు. కంపెనీల వర్గీకరణ, మినహాయింపులు, పాటించాల్సిన నిబంధనల నిర్ధారణ, కార్పొరేట్‌ సామాజిక బాధ్యతకు సంబంధించిన పరిమితి, ఆడిట్‌ బాధ్యతలు, జరిమానాల చట్రాలు వంటి కీలక విధానపరమైన అంశాలను తగిన శాసన మార్గదర్శకత్వం లేకుండా అనుబంధ శాసనలకు వదిలివేశారని మనీష్‌ తివారీ విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -