Monday, March 23, 2026
E-PAPER
Homeజాతీయంకుకీజో చైర్మన్‌పై దుండగుల దాడి.. భద్రతా దళాల కాల్పులు

కుకీజో చైర్మన్‌పై దుండగుల దాడి.. భద్రతా దళాల కాల్పులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మణిపూర్‌లోని కుకీజో కమ్యూనిటీ చైర్మన్‌ హెచ్‌.థాంగ్లెట్‌పై దాడికి యత్నించిన సాయుధ దుండుగలపై కాల్పులు జరిపినట్లు అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల ప్రకారం.. మణిపూర్‌లోని చురాచంద్‌పూర్‌ జిల్లా కేంద్రంలోని చైర్మన్‌ నివాసంలో ఉగ్రవాదులు ఉన్నారని ఆరోపిస్తూ ఆదివారం మధ్యాహ్నం ఆయుధాలు ధరించిన కొందరు యువకులు ఆయన నివాసంపై రాళ్లు రువ్వడంతో పాటు లోపలికి చొరబడేందుకు యత్నించారు. భద్రతా దళాలు టియర్‌గ్యాస్‌ ప్రయోగించి, వారిని చెదరగొట్టాయి. వెనక్కి వెళ్లిన దుండుగులు ఆదివారం రాత్రి తిరిగి చైర్మన్‌ నివాసంలోకి చొరబడేందుకు యత్నించగా, వారిని అడ్డుకునేందుకు కాల్పులు జరిపినట్లు భద్రతా దళాలు పేర్కొన్నాయి. చురాచంద్‌పూర్‌ జిల్లా సమీపంలోని తుయిబాంగ్‌ ప్రాంతంలో కొందరు ఆందోళనకారులు టైర్లను తగులబెట్టారని, టియర్‌గ్యాస్‌తోవారిని చెదరగొట్టారని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -