నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియా యుద్ధానికి ఐదు రోజుల విరామం లభించింది. ఈ మేరకు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా వేదికగా వెల్లడించారు. మరో వారం పాటు ఇరాన్‌తో చర్చలు జరగొచ్చని పేర్కొన్నారు. చర్చల ఫలితంపై ఆధారపడి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్నారు. ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయన్నారు. ఫిబ్రవరి 28న ఇజ్రాయిల్-అమెరికా సంయుక్త దాడులతో ఇరాన్‌పై విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్‌తో పాటు అనేక మంది కీలక నేతలను ఇరాన్ కోల్పోయింది. దీంతో ఇరాన్ ప్రతిదాడులకు పూనుకుంది. ఇజ్రాయిల్ పై డ్రోన్లతో పాటు క్షిపణులు వేసింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న యూఎస్ సైనిక స్థావరాలను ఇరాన్ దళాలు ధ్వంసం చేశాయి.
పశ్చిమాసియా యుద్ధానికి ఐదు రోజులు బ్రేక్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



