Monday, March 23, 2026
E-PAPER
Homeజాతీయంలోక్‌స‌భ‌లో ప్ర‌ధాని మోడీ ప్ర‌సంగం

లోక్‌స‌భ‌లో ప్ర‌ధాని మోడీ ప్ర‌సంగం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న ప‌రిస్థితిపై ఇవాళ ప్ర‌ధాని మోదీ(PM Modi) లోక్‌స‌భ‌లో మాట్లాడారు. దౌత్యం, చ‌ర్చ‌ల ద్వారానే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌న్నారు. దౌత్య‌ప‌ర‌మైన అంశంలో భార‌త్ స్ప‌ష్టంగా ఉంద‌ని, ప‌శ్చిమాసియాలో ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించేందుకు భార‌త్ ప్ర‌య‌త్నిస్తోంద‌న్నారు.సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భార‌త్ సిద్ధంగా ఉంద‌ని ప్ర‌ధాని అన్నారు. గ‌త దశాబ్ధం కాలం నుంచి ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రియార్టీ ఇచ్చామ‌ని, దీనిలో భాగంగా ముడి చ‌మురును స్టోరేజీని పెంచామ‌న్నారు. భార‌త్ వ‌ద్ద ప్ర‌స్తుతం 53 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల స్ట్రాట‌జిక్ రిజ‌ర్వ్ పెట్రోల్ ఉంద‌ని ప్ర‌ధాని వెల్ల‌డించారు. ఇది ఆయ‌ల్ కంపెనీల వ‌ద్ద ఉన్న రిజ‌ర్వ్‌ల‌కు సంబంధం లేనిద‌ని ఆయ‌న అన్నారు. గ‌డిచిన 11 ఏళ్ల కాలంలో రిఫైన‌రీ కేపాసిటీ కూడా పెంచుకున్నామ‌ని ప్ర‌ధాని తెలిపారు. వ్య‌వ‌సాయంపై కూడా ప‌శ్చిమాసియా యుద్ధ ప్ర‌భావం ప‌డుతుంద‌ని, కానీ ప్ర‌భుత్వం మాత్రం కావాల్సినంత ఫెర్టిలైజ‌ర్‌ను స‌మ‌కూర్చుతోంద‌న్నారు.

ప‌శ్చిమాసియాలో యుద్దం మొదలైన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు 3.75 ల‌క్ష‌ల మంది భార‌తీయులు తిరిగి వ‌చ్చిన‌ట్లు చెప్పారు. కేవ‌లం ఇరాన్ నుంచి 1000 మంది భార‌తీయులు సుర‌క్షితంగా వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించారు. దీంట్లో ఎంబీబీఎస్ చ‌దువుతున్న 700 మంది విద్యార్థులు ఉన్నారు. ప‌శ్చిమాసియా ప్ర‌భావాన్ని త‌గ్గించేందుకు స్వ‌ల్ప కాలిక‌, మ‌ధ్య‌శ్రేణి, దీర్ఘ‌కాలిక వ్యూహాల‌ను అనుస‌రిస్తున్న‌ట్లు చెప్పారు. భార‌త్ వ‌ద్ద 53 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల పెట్రోలియం రిజ‌ర్వ్‌లు ఉన్నాయ‌ని, ఇథ‌నాల్ బ్లెండింగ్ వ‌ల్ల .. గ‌తంతో పోలిస్తే భార‌త్ సుమారు 4.5 కోట్ల బ్యార‌ళ్ల ఇంధ‌నాన్ని త‌క్కువ దిగుమ‌తి చేసుకుంటోంద‌ని ప్ర‌ధాని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -