నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ గ్రామ అభివృద్ధికి మద్నూర్ గ్రామానికి చెందిన బడా వ్యాపారవేత రామ్ సుఖ బాల్ ముకుంద్ ఇనాని ఎన్నో రకాల సేవలు అందించారని ఆసుపత్రి రోగుల సౌకర్యార్ధాన్ని దృష్టిలో పెట్టుకొని త్రాగునీటి కోసం వాటర్ ఫిల్టర్ మిషన్ అందజేసినందుకు ఆ కుటుంబానికి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వాటర్ ఫిల్టర్ మిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి అన్నారు.
మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి రాం సుఖ్ బాల్ ముకుంద్ ఇనాని పేరిట వాటర్ ఫిల్టర్ మిషన్ ను సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రీ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. దీని విలువ రూ.60వేలు ఉందని ఇనాని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆనంద్ జాదవ్, డాక్టర్ హింగోళే, మొగులాజీ, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.



