– తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బురుగు స్వప్న
నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ : అంగన్వాడీలకు బడ్జెట్లో బడ్జెట్ కేటాయించి కనీస వేతనాలు చెల్లించాలని అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా ముట్టడి చేసి, ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బూరుగు సప్న, యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు దాసరి పాండులు మాట్లాడుతూ ఏళ్ల తరబడిగా గ్రామాలలో పట్టణాల్లో అంగన్వాడీ టీచర్లుగా చిన్నపిల్లలకు గర్భిణీ స్త్రీలకు విద్యాబుద్ధులు పౌష్టికాహారం సకాలంలో అందిస్తూ, దేశ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా పనిచేస్తూ కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ టీచర్ల పట్ల ఆయాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు కనీస వేతనాలు కార్మిక చట్టాలు అమలు చేస్తామని, అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేసిన నిధుల కేటాయించి బలోపితం చేస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సమస్యలు పరిష్కారం చేయలేదనారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా
ఒక సమస్య పరిష్కారం చేయలేదని బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీలకు బడ్జెట్ కేటాయించి కనీస వేతనం 18000 చెల్లించాలని రెగ్యులర్ చేయాలని, కార్మిక చట్టాలైన ఈఎస్ ఐపిఎఫ్ అమలు చేయాలని రిటైర్మెంట్ అయినా ఆయాలకు టీచర్లకు వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని అంగన్వాడి కేంద్రాలకు సొంత భవనాలు ఏర్పు నిర్మాణం చేయాలని వేసవి సెలవులు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరు రమాకుమారి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు



