– ఇబ్బందుల్లో లబ్ధిదారులు
నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ : దళితుల అభివృద్ధి ధ్యేయంగా దళితుల ఆర్థిక స్పాలంబన కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో అధికారుల నిర్లక్ష్యంతో.లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు వివరాలలో పరిశీలిస్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో మోత్కూరు, అడ్డగూడూరు జిల్లాలకు సంబంధించి దళిత బంధు రెండో విడతలో భాగంగా లబ్ధిదారులు తమ అకౌంట్లో మూడు లక్షల రూపాయలను జమ చేశారు
. ప్రభుత్వం నుంచి రావాల్సిన 7 లక్షల రూపాయలు జమచేసి గ్రౌండింగ్ పూర్తి చేయడంతో ప్రోసిడింగ్ పత్రాలు ఇవ్వాలని కోరారు. అధికారులు ఎలక్షన్ కోడు ఉందని అకౌంట్లను ఫ్రీజింగ్ చేశాయి. ఎన్నికల అయిపోయి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు లబ్ధిదారులకు సంబంధిత పథకం ఫలాలు అందకపోవడంతో దిక్కు తోచని పరిస్థితిలోమంటున్నారు. అయినప్పటికీ పథకం గ్రౌండింగ్ పై పై అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని సోమవారం రోజు యాదాద్రి భువనగిరి కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. లబ్ధిదారుడు ఖాతాలో మూడు లక్షలు జమ చేసినప్పటికీ అధికారులు అవి గ్రౌండ్ పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వకపోవడంతో సంవత్సరం నుండి కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన అధికారులు పట్టించుకోవడం లేదనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో 2021 ఆగస్టు 5వ తేదీన తుర్కపల్లి మండలంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేసింది. దళిత బంధు పథకం కింద సుమారు 254 మంది లబ్ధిదారులకు 10 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నేటికీ మొదటిది విడుదల గ్రౌండ్ ఐ లబ్ధిదారుల ఖాతాలో నిల్వ ఉన్న 324.75 కోట్లు నిధులను విడుదల చేయాలని 28 జనవరి 2025 న రాష్ట్ర షెడ్యూల్ కులాల కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ పేరున ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు అడ్డగోడూరు మండలాల లబ్ధిదారుల రెండో విడత మంజూరైన 254 లబ్ధిదారుల ఖాతాలో ఉన్న 7.62 కోట్ల నిధులను సైతం దళిత బంధు మార్గదర్శకాలు పాటించి అసెంబ్లీ ఎన్నికల ముందు విడుదల చేశారు. అయినప్పటికీ అధికారులు లబ్ధిదారులకు సకాలంలో అందించకపోవడంతో దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించాడన్న సిద్ధంగా వారి పరిస్థితి తయారయింది.
దళిత బంధు నిధులు విడుదల చేయాలని సంవత్సరాలుగా నిత్యం ప్రభుత్వ కార్యాల చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు నిధులు జమ అయిన డ్రా చేసుకోలేని దుస్థితిలో ఉన్నాము దళిత బంధు గ్రౌండింగ్ ఉండడంవల్ల రాజీవ్ యువ వికాస్, ఏ ఇతర పథకాలకు అవకాశం లేకుండా పోతుందని, అధికారులు ఇకనైనా దళిత బంధు నిధులు విడుదల చేసి మా జీవితాల్లో వెలుగులు నింపాలని అన్నారు.
– దళిత బంధు లబ్ధిదారుడు కూరెళ్ళ రమేష్



