– బోనకల్ – జగ్గయ్యపేట ఆటోలకు పార్కింగ్ స్థలం కేటాయింపు
– సర్పంచ్, గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని అభినందించిన అధికారులు
నవతెలంగాణ – బోనకల్ : ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల కేంద్రంలోని స్థానిక ఖమ్మం బస్టాండ్ సెంటర్ అభివృద్ధిపై గ్రామ సర్పంచ్ బానోత్ జ్యోతి ఉపసర్పంచ్ బానోతు కొండ దృష్టి సారించారు. అదేవిధంగా అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను శుభ్రం చేశారు. మురికి కంపుకొట్టకుండా చర్యలు తీసుకున్నారు.
ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఆటోలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను కేటాయించారు. దీంతో బోనకల్ గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని ఎంపీడీవో రురావత్ రమాదేవి, ఎస్సై పొదిలి వెంకన్న ప్రత్యేకంగా అభినందించారు. బోనకల్ మండల కేంద్రంలోని మెయిన్ సెంటర్ అభివృద్ధిపై గ్రామ సర్పంచ్ బానోతు జ్యోతి కొండ ప్రత్యేక దృష్టి సారించారు.గతంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను సమగ్రంగా పునరుద్ధరించి, డ్రైనేజీ పై చిన్న గోడను నిర్మించి మురికి కంపు రాకుండా పూర్తిగా ప్రత్యేకంగా తయారుచేసిన మూతలతో మూసి వేశారు. దీంతో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న మురుకు కంపు వాసన సమస్య గణనీయంగా తగ్గింది.స్థానిక ఖమ్మం బస్టాండ్ సెంటర్‌లో తరచూ ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని, వాహనదారుల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాన్ని గ్రామపంచాయతీ పాలకవర్గం కేటాయించింది. ప్రధానంగా సెంటర్ లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్, కూరగాయల మార్కెట్ ఎదురుగా, అదేవిధంగా బ్రిడ్జి చివరి భాగంలో బైక్ పార్కింగ్ స్థలాలను కేటాయించారు.ఈ నివారణ చర్యల వలన స్థానిక ఖమ్మం బస్టాండ్ సెంటర్లో వాహనాల రద్దీ తగ్గి, ప్రమాదాలు జరగకుండా ప్రయాణికులకు సౌకర్యవంతం కల్పించారు.బోనకల్ నుంచి జగ్గయ్యపేట వెళ్లే ఆటోలకు కూడా పార్కింగ్ స్థలాన్ని ప్రత్యేకంగా కేటాయించారు.
“శుభ్రత పరిశుభ్రతే మా ధ్యేయం” అని సర్పంచ్ బానోత్ జ్యోతి కొండ పేర్కొంటూ గ్రామాన్ని పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. స్థానిక ఖమ్మం బస్టాండ్ సెంటర్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను మండల ఎంపీడీవో పురావత్ రమాదేవి, ఎస్సై పొదిలి వెంకన్న సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సర్పంచ్ బానోతు జ్యోతి, గ్రామ పంచాయతీ పాలకవర్గం పనితీరును ప్రత్యేకంగా అభినందించారు. గ్రామ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తాయని వారు ప్రశంసించారు. ఇదేవిధంగా గ్రామపంచాయతీ అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని సర్పంచ్, గ్రామపంచాయతీ పాలకవర్గానికి సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ కొండ, ఉప సర్పంచ్ బానోత్ కొండ, గ్రామపంచాయతీ కార్యదర్శి కోలా రాజేశ్వరి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పోటు వెంకటేశ్వర్లు, ఉప్పర శ్రీను, బోనకల్ మాజీ సొసైటీ అధ్యక్షులు గుండపనేని సుధాకర్ రావు, టిడిపి నాయకులు నందమూరి సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ గంగుల శ్రీనివాసరావు, బిజెపి నాయకులు గూగులోతు నాగేశ్వరరావు, మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గుగులోతు రమేష్, గ్రామస్తులు గంగుల పుల్లయ్య, షేక్ బాజీ, జరుపల శివకృష్ణ, గుగులోతు శ్రీనివాసరావు, స్థానిక వ్యాపారస్తులు రాము, కలవల వెంకట లక్ష్మీనారాయణ (బాబు) సిహెచ్ ప్రసాద్, ఇండ్ల కాలేబు, రేగళ్ల వీరయ్య, మల్టీ వర్కర్స్ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, స్థానిక వ్యాపారస్తులు ఈ మార్పులపై హర్షం వ్యక్తం చేస్తూ సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.



