Monday, March 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మెరుగైన వైద్య సేవలను అందించడం అభినందనీయం

మెరుగైన వైద్య సేవలను అందించడం అభినందనీయం

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్  : గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గ్రామ స్థాయిలోనే మెరుగైన వైద్య సేవలను అందించడం అభినందనీయమని గ్రామ సర్పంచ్ కంతి మధు అన్నారు. సోమవారం ఆలేరు మండలం శారాజిపేట గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరాన్ని సర్పంచ్ కంతి మధు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని తెలిపారు. ప్ర ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన నిపుణులైన డాక్టర్లు పాల్గొని రోగులకు పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్ వంటి సాధారణ పరీక్షలతో పాటు కంటి పరీక్షలు మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి ఉచితంగా వైద్య సలహాలు, మందులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో శారాజిపేట పీహెచ్ సి  మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హైమావతి,ఉప సర్పంచ్ దూడల శ్రీధర్ గౌడ్,వార్డు సభ్యులు పెండ్యాల నాగరాజు, దూడల సుమలత సంతోష్,పుట్టల సునిత,కంతి బాలరాజు పాల్గొన్నారు.అలాగే నిపుణ వైద్యులు డాక్టర్ విజయ్ (జనరల్ మెడిసిన్),డాక్టర్ రాశి (స్త్రీల వ్యాధి నిపుణులు), డాక్టర్ కవిత (శిశు వైద్య నిపుణులు), డాక్టర్ ఆత్రమ్ (కీళ్ల వ్యాధుల నిపుణులు), డాక్టర్ శ్రీలక్ష్మి (దంత వైద్య నిపుణులు),డాక్టర్ అశ్విత్ (కంటి వైద్య నిపుణులు) పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -