Monday, March 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లాలో జంతు జనన నియంత్రణ కార్యక్రమం తక్షణ ప్రారంభం 

జిల్లాలో జంతు జనన నియంత్రణ కార్యక్రమం తక్షణ ప్రారంభం 

- Advertisement -

–  కలెక్టర్ ఆదేశాలు
నవతెలంగాణ-కామారెడ్డి : జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా వెటర్నరీ పశుసంవర్ధక శాఖ అధికారి, మునిసిపల్ కమిషనర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలో జంతు జనన నియంత్రణ (Animal Birth Control – ABC) కార్యక్రమాన్ని అత్యవసరంగా ప్రారంభించాలని, గరిష్టంగా రెండు రోజుల్లోనే అమలు చేయాలని ఆయన స్పష్టంగా సూచించారు. ప్రస్తుతం అందుబాటులో లేని అవసరమైన ఔషధాలను తక్షణమే కొనుగోలు చేసి, వాటి లభ్యతను నిరంతరం నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ఆలస్యం లేకుండా ప్రారంభించి, ముందుగా ధోమకొండలో అమలు చేయాలని పేర్కొన్నారు. సంబంధిత జిల్లా అధికారులు ఈ ఆదేశాలను వెంటనే అమలు చేసి, ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -