- Advertisement -
– జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
నవతెలంగాణ – కామారెడ్డి : కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వివిధ సమస్యలపై వచ్చిన ఆయా శాఖలకు సంబంధించిన 96 అర్జీలను అర్జీదారుల నుండి స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ ప్రజావాణి లో వచ్చిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతగా గుర్తించి తక్షణమే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి లో అసిస్టెంట్ కలెక్టర్ ( లోకల్ బాడీ ) మధుమోహన్, సీఈఓ చందర్, ఆర్డీవో వీణ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు
- Advertisement -



