నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా, జిమ్ సార్బ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘కుబేర’. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘పోయిరా మామా’ను మేకర్స్ ఆదివారం రిలీజ్ చేశారు. ముగ్గురు జాతీయ అవార్డ్ విజేతలు ధనుష్, దర్శకుడు శేఖర్ కమ్ముల, దేవిశ్రీ ప్రసాద్ కలయికలో వస్తున్న చిత్రమిది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఈ పాట ఎక్స్‌ప్లోసివ్ ఎనర్జీతో ఉంది. ఫుట్ టాపింగ్ బిట్స్‌తో ప్రేక్షకుల హదయాలను వెంటనే గెలుచు కుంటాయి. ధనుష్ స్వయంగా పాడిన వాయిస్ ఈ పాటకి మరింత ఫీల్ తీసుకొచ్చింది. భాస్కరభట్ల రాసిన సాహిత్యం అందరినీ అలరిస్తూ, మాస్ టచ్‌కి తగిన రిథమిక్ మ్యాజిక్‌ను అందించింది. శేఖర్ వి.జె అందించిన కొరియోగ్రఫీ పాటను ఒక విజువల్ ట్రీట్‌గా మలిచింది. ధనుష్ డాన్స్‌లో చూపిన స్పిరిట్, ఎనర్జీ, ఒరిజినాలిటీ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. ఈ పాటలో విజువల్స్, వాయిస్, సాహిత్యం, కొరియోగ్రఫీ అన్నీ కలసి ఒక అద్భుత అనుభూతిని అందిస్తున్నాయి అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో ఏక కాలంలో రూపొందింది. హిందీ, కన్నడ, మలయాళం భాషలలోనూ ఈ సినిమా జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రై.లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్‌రావు నిర్మిస్తున్నారు.
మాస్ బీట్‌తో ‘పోయిరా మామా’..
- Advertisement -
RELATED ARTICLES