Tuesday, March 24, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహర్మూజ్ జలసంధి టోల్ వసూళ్ల వార్తలను ఖండించిన ఇరాన్

హర్మూజ్ జలసంధి టోల్ వసూళ్ల వార్తలను ఖండించిన ఇరాన్

- Advertisement -

నవతెలంగాణ -హైదరాబాద్: పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని ఇరాన్ నియంత్రిస్తోంది. ఈ జలసంధి మీదుగా వెళ్లే నౌకల నుంచి 2 మిలియన్ డాలర్లు టోల్ ఫీజుగా వసూలు చేయనున్నారనే ప్రచారంపై ఇరాన్ రాయబార కార్యాలయం స్పందించింది. అదనపు ఛార్జీలపై అధికారిక నిర్ణయం తీసుకోలేదని, కొందరు వ్యక్తిగత అభిప్రాయాలను మాత్రమే వెల్లడించారని, వాటితో ప్రభుత్వానికి సంబంధం లేదని ఖండించింది. ఇరాన్ మీడియా మాత్రం, అమెరికా-ఇజ్రాయెల్‌తో యుద్ధం వల్ల ఖర్చులు పెరగడంతో అదనపు ఛార్జీలు వసూలు చేయాల్సి వస్తోందని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యుడిని ఉటంకిస్తూ వార్తలు ప్రసారం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -