Tuesday, March 24, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకట్నం కోసం వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

కట్నం కోసం వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : అదనపు కట్నం కోసం భర్త, అత్త వేధింపులు భరించలేక వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం జక్కరం గ్రామానికి చెందిన వెంకన్నబాబు, కల్యాణం నాగలక్ష్మి (26) దంపతులు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానం. మూడేళ్లుగా అదనపు కట్నం తీసుకురావాలంటూ ఆమె భర్త, అత్త వేధింపులకు గురి చేస్తున్నారు. దాంతో మనస్తాపానికి గురై సోమవారం నాగలక్ష్మి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -