Tuesday, March 24, 2026
E-PAPER
Homeజాతీయంఅమరావతిలో భారీ అగ్నిప్రమాదం..

అమరావతిలో భారీ అగ్నిప్రమాదం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో తుళ్లూరు మండలం రాయపూడి వద్ద భారీగా మంటలు ఎగసిపడ్డాయి. రాజధాని పనుల కోసం మేఘా ఇంజినీరింగ్ సంస్థ నిల్వ ఉంచిన పైపులకు నిప్పంటుకోవడంతో అవి పూర్తిగా దగ్ధమయ్యాయి. దట్టమైన పొగ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే మూడు అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే, కొన్ని రోజుల క్రితమే వెలగపూడి సమీపంలో ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన కోట్ల విలువైన పైపులు ఇలాగే అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. ఆ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమగ్ర విచారణకు ఆదేశించినప్పటికీ, ఆ దర్యాప్తు పూర్తికాకముందే ఇప్పుడు అదే తరహాలో మరో ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -