- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ చేసే వినియోగదారులకు షాక్ ఇస్తూ జొమాటో, స్విగ్గీలు తమ ప్లాట్‌ఫారమ్ ఫీజులను పెంచాయి. జొమాటో ఫీజును రూ.12.50 నుంచి రూ.14.90కు పెంచగా, స్విగ్గీ రూ.14.99 నుంచి రూ.17.58 (జీఎస్టీతో కలిపి)కు పెంచింది. ఈ పెంపుతో ప్రతి ఆర్డర్‌పై వినియోగదారులపై అదనపు భారం పడనుంది. యాప్ సాంకేతికతను మెరుగుపరచడం, నిర్వహణ ఖర్చులు, కార్యకలాపాల వ్యయం పెరగడమే ఈ ధరల పెంపునకు కారణమని సంస్థలు చెబుతున్నాయి.
- Advertisement -



