Wednesday, March 25, 2026
E-PAPER
Homeబీజినెస్ఫిలిప్స్ వన్ చెఫ్ విడుదల

ఫిలిప్స్ వన్ చెఫ్ విడుదల

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్:

భారతీయ గృహాలకు పాకశాస్త్ర అవకాశాల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ, రోజువారీ వంటను సులభతరం చేయడానికి రూపొందించిన వినూత్నమైన ఆల్-ఇన్-వన్ స్మార్ట్ కుకింగ్ ఉపకరణం అయిన ఫిలిప్స్ వన్ చెఫ్ ను విడుదల చేస్తున్నట్టు ఫిలిప్స్ హోమ్ అప్లయన్సెస్ వెల్లడించింది. ముంబైలో, రణ్ వీర్ బ్రార్ పర్యవేక్షణలో జరిగిన ఒక అనుభవపూర్వకమైన చెఫ్స్ టేస్టింగ్ టేబుల్ కార్యక్రమంలో ఈ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథులను లైవ్ టేస్టింగ్స్, ఇంటరాక్టివ్ ఫుడ్ స్టేషన్ల ద్వారా భారతదేశంలోని విభిన్న వంట రుచులను అన్వేషించడానికి ఆహ్వానించారు. ఈసందర్భంగా గుల్బహర్ తౌరానీ మాట్లాడుతూ… వెర్సుని వద్ద భారతీయ కుటుంబాలు వాస్తవానికి ఎలా వంట చేస్తాయో అర్థం చేసుకోవడం, వారి రోజువారీ వంటలలో సహజంగా ఇమిడిపోయే ఉపకరణాలను రూపొందించడంపైనే తమ లక్ష్యం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.

భారతీయ వంటకాలు చాలా వైవిధ్యమైనవి, తరచుగా ఎక్కువ సమయం తీసుకుంటాయన్నారు. అందుకే రుచిలో రాజీపడకుండా వంట ప్రక్రియలను సులభతరం చేసే పరిష్కారాలు రోజురోజుకూ ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నా యన్నారు. భారతీయ వంటకాలు ఎంతో వైవిధ్యభరితంగా, విభిన్నంగా ఉంటాయన్నారు. రుచి పరంగా ఎలాంటి రాజీపడకుండా వాటిని మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించగలదన్నారు. ఆ సమతుల్యతను తీసుకురావడానికే వన్ చెఫ్ రూపొందించబడింది. ఇది ఇళ్లలో వంటి చేసే వారికి అనేక రకాల వంటకాలను మరింత సులభంగా, ఆత్మవిశ్వాసంతో అన్వేషించడంలో సహాయపడుతుందని చెఫ్ రణ్ వీర్ బ్రార్ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -