Wednesday, March 25, 2026
E-PAPER
Homeజాతీయంఅజిత్ పవార్ మృతిపై జీరో FIR నమోదు

అజిత్ పవార్ మృతిపై జీరో FIR నమోదు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అజిత్ పవార్ మృతి చెందిన ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అజిత్ పవార్ మరణంపై కర్నాటక రాజధాని బెంగళూర్‎లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. అజిత్ పవార్ మేనల్లుడు, ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అజిత్ పవార్ మరణం వెనక భారీ కుట్ర ఉందని రోహిత్ పవార్ ఆరోపించారు. మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణంపై ఆయన మేనల్లుడు అజిత్ పవార్ ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు కోసం మహారాష్ట్ర పోలీసులకు అప్పగించామని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. జీరో ఎఫ్ఐఆర్ అంటే.. నేరం ఎక్కడ జరిగిందనే దానితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా కేసు నమోదు చేయడాన్ని ‘జీరో ఎఫ్‌ఐఆర్’ అంటారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -