- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్, 5 రైసినా రోడ్‌లలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను ఖాళీ చేయాలని కేంద్ర నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. మార్చి 28వ తేదీలోగా ఈ భవనాలను అప్పగించాలని స్పష్టం చేసింది. 48 ఏళ్లుగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయం 24 అక్బర్ రోడ్‌లో కొనసాగుతోంది. నిబంధనల ప్రకారం, సొంత స్థలాల్లో కార్యాలయాలు నిర్మించుకున్న తర్వాత ప్రభుత్వ భవనాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది.
- Advertisement -



