- Advertisement -
నవతెలంగాణ – మియాపూర్ : మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పత్రిక నగర్ లో అక్రమంగా తరలిస్తున్న 31 సిలిండర్ల వ్యాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్ ఎస్ హెచ్ ఓ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. అక్రమంగా సిలిండర్లను తరలిస్తున్నారని సమాచారం రావడంతో ఘటన స్థలానికి వెళ్లి తనిఖీ చేయగా 31 సిలిండర్లతో కూడిన ఒక వ్యాన్ ను స్వాధీనం చేసుకున్నాము. వ్యాన్ డ్రైవర్ తో పాటు మరో వ్యక్తి అరెస్టు చేశామని తెలిపారు. ఇలాంటి చర్యలకు పాలుపడితే కఠినమైన చర్యలు ఉంటాయని తెలిపారు. గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్లో విక్రయించే ప్రయత్నం ఎవరు చేసిన వెంటనే పోలీసులు దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.
- Advertisement -



