నవతెలంగాణ హైదరాబాద్:
పాలిబియన్, న్యూరోబియన్, లివోజెన్ వంటి బ్రాండ్లను తయారు చేసే పి అండ్ జి హెల్త్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తో కలిసి ఒక ముఖ్యమైన భాగస్వామ్యంలో, భారతదేశంలో వైద్యుల కోసం రూపొందించిన మొదటి రోగి కోలుకునే మార్గదర్శకాలను క్లినికల్ అప్లికేషన్ ఆఫ్ మైక్రోన్యూట్రియెంట్స్ ఇన్ రికవరీ పేరుతో ప్రారంభించినట్లు ప్రకటించింది.
ఈ సందర్భంగా ప్రాక్టర్ అండ్ గాంబిల్ హెల్త్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మిలింద్ తాట్టే మాట్లాడుతూ… పి అండ్ జి హెల్త్, రోగి-కేంద్రీకృత ఆరోగ్య సంరక్షణను ముందుకు తీసుకెళ్లేందుకు తాము కట్టు బడి ఉన్నామన్నారు. ఇందుకోసం, మెరుగైన ఆరోగ్య ఫలితాలను సాధించడంలో సహాయపడే, రోగుల జీవితాల్లో అర్థవంతమైన మార్పును తీసుకువచ్చే ఆధారపూర్వక పరిష్కారాలను అందించడానికి వైద్య సమాజంతో తాము నిరంతరం భాగస్వామ్యం కొనసాగిస్తున్నామన్నారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నేషనల్ ప్రెసిడెంట్ డా. అనిల్ కుమార్ జె. నాయక్ మాట్లాడుతూ…. రోగుల కోలుకునే సమయంలో పోషక మద్దతుకు సంబంధించి ఒక సమగ్ర, ఆధారపూర్వక విధానం కోసం భారత వైద్య సమాజం చాలా కాలంగా ఎదురు చూస్తోందన్నారు. కొత్తగా వెలుగులోకి వస్తున్న శాస్త్రీయ ఆధారాలు, కోలుకునే ప్రక్రియలో పాల్గొనే ముఖ్యమైన శారీరక ప్రక్రియలకు బి-కాంప్లెక్స్ విటమిన్లు, ఇతర సూక్ష్మ పోషకాలు ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాయో స్పష్టంగా చూపిస్తున్నాయన్నారు.



