Thursday, March 26, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 10 మంది మృతి

నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 10 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దౌలత్‌దియా ఘాట్ సమీపంలో 35 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి పద్మా నదిలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృతి చెందగా, 11 మంది ప్రాణాలతో బయటపడ్డారు. బస్సును ఫెర్రీపైకి ఎక్కించే సమయంలో నియంత్రణ కోల్పోవడంతో ఇది సుమారు 35 అడుగుల లోతున్న నదిలోకి దూసుకెళ్లింది. అనంతరం భారీ క్రేన్ సాయంతో బస్సును బయటకు తీశారు. గల్లంతైన వారి కోసం డైవర్లు, గజ ఈతగాళ్లు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -