- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 14 మంది సజీవదహనం అయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదంలో మరో 20 మందికి పైగా గాయాలు కావడంతో వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.
- Advertisement -



