- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పర్షియన్ గల్ఫ్‌లోని కీలకమైన ఖర్గ్ ద్వీపాన్ని ఆక్రమించుకునేందుకు అమెరికా సిద్ధమవుతోందని అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇందుకోసం 1,000 మంది పారాట్రూపర్లు, వేలాది మంది మెరైన్లను యూఎస్ మోహరించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఖర్గ్‌ను రక్షించుకునేందుకు ఇరాన్ సిద్ధమైంది. ఇందుకోసం అమెరికా దళాలను అక్కడ అడుగుపెట్టనీయకుండా ఇరాన్ భారీగా మందుపాతరలు అమర్చినట్లు సమాచారం. అంతేకాకుండా అక్కడికి భారీగా బలగాలను తరలిస్తున్నట్లు పలు వర్గాలు పేర్కొన్నాయి.
- Advertisement -



