Thursday, March 26, 2026
E-PAPER
Homeనల్లగొండఅరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆప‌లేరు: డివైఎఫ్ఐ

అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆప‌లేరు: డివైఎఫ్ఐ

- Advertisement -

నవతెలంగాణ-పెద్దవూర: అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచి వేయలేరని డీవైఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు నాగేంద్ర ప్రసాద్, బాబూనాయక్ అన్నారు. గురువారం నిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు అసంబ్లీ ముట్టడికి పిలుపు నిచ్చిన సందర్బంగా నిరుద్యోగ సంఘాల నాయకులను పెద్ద వూరలో ముందస్తు అరెస్ట్ చేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ..నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని,నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రూ.4వేల‌ రూపాయలు చెల్లించాల‌ని డిమాండ్ చేశారు. అలాగే రాజీవ్ యువ వికాస పథకాన్ని అమలు చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని అన్నారు.ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో ఉద్యమాలను ఉదృతం చేస్తామని అన్నారు.అరెస్టు అయిన వారిలో డీవైఎఫ్ఐ మండల్ కన్వీనర్ తరి రామకృష్ణ, మండల్ కమిటీ సభ్యులు షైక్ మైనుద్దీన్
ఉన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -