Thursday, March 26, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపెట్రోల్, డీజిల్ నిల్వ‌ల‌పై సివిల్ సప్లై కమిషనర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

పెట్రోల్, డీజిల్ నిల్వ‌ల‌పై సివిల్ సప్లై కమిషనర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైర‌దాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో సరిపడా నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రాబోయే 60 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ల సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 484 ట్రక్కుల గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేసినట్లు కమిషనర్ తెలిపారు. డిమాండ్‌కు మించి సరఫరా జరుగుతున్నప్పటికీ, ప్రజలు అవసరానికి మించి బుకింగ్స్ చేయడం వల్ల కొంత ఒత్తిడి పెరుగుతోందని ఆయన వివరించారు. పైపుడ్ నేచురల్ గ్యాస్ (PNG), మరియు వాహనాలకు వాడే CNG సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -