Thursday, March 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సేవతోనే రాజకీయ పదవులకు గుర్తింపు

సేవతోనే రాజకీయ పదవులకు గుర్తింపు

- Advertisement -

  • డిసిసి జిల్లా ఉపాధ్యక్షుడు గంప ప్రసాద్ కు సన్మానం

– కామారెడ్డి రక్తదాత సమూహం ఆధ్వర్యంలో

నవతెలంగాణ – కామారెడ్డి

కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా నియామకం అయిన గంప ప్రసాద్ ను రక్తదాతల సమూహ సభ్యులు సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రక్తదాతల సమూహ ఫౌండర్ డాక్టర్ బాలు, గౌరవ అధ్యక్షులు డాక్టర్ వేద ప్రకాష్, అధ్యక్షులు జమీల్ అహ్మద్ లు మాట్లాడుతూ సేవతోనే రాజకీయ పదవులకు గుర్తింపు  వస్తుందని, కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడిగా గంప ప్రసాద్ ఎన్నో రక్తదాన సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని, వ్యక్తిగతంగా 25 సార్లు రక్తదానం చేయడమే కాకుండా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన రక్తదాన శిబిరాలను విజయవంతం చేయడం కోసం పనిచేయడం జరిగిందని, సామాజిక సేవ చేస్తున్న వ్యక్తులకు రాజకీయ పదవులు రావడం అభినందనీయమని దీనికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డాక్టర్ పుట్ల అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్, పర్ష వెంకటరమణ, సలహాదారులు జాలిగామ శ్రీకాంత్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -