నవతెలంగాణ – హైదరాబాద్: అంతర్జాతీయంగా నెలకొన్న ఇంధన సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు భారీ ఊరట కల్పించింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రూ.10 చొప్పున తగ్గిస్తూ ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తాజా తగ్గింపుతో లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం కేవలం రూ.3కు చేరగా, డీజిల్‌పై సుంకాన్ని పూర్తిగా రద్దు చేసి సున్నాకు తగ్గించింది.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. ఈ యుద్ధం కారణంగా ఇరాన్.. హర్మూజ్ జలసంధిపై దిగ్బంధం విధించడంతో ముడిచమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రపంచంలోని మొత్తం ముడిచమురు, గ్యాస్ సరఫరాలో ఐదో వంతు (రోజుకు 20 నుంచి 25 మిలియన్ బ్యారెళ్లు) ఇదే మార్గం గుండా రవాణా అవుతుంది.



