- Advertisement -
నవతెలంగాణ భద్రాచలం: భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున స్వామి వారికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కల్యాణోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమిపూజ చేశారు. తొలి విడతలో రూ.351 కోట్లతో చేపట్టే పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
- Advertisement -



